Headlines :
-
నవంబర్ 8న సీఎం రేవంత్ పాదయాత్ర – మూసీ నది వెంట నడవనున్న రేవంత్ రెడ్డి
-
పుట్టినరోజు సందర్భంలో సీఎం రేవంత్ పర్యటన – యాదాద్రి దర్శనం, మూసీ నది పరిశీలన
-
మూసీ నది పరిశీలనతో నవంబర్ 8న రేవంత్ పాదయాత్ర
-
వలిగొండ సంగెం గ్రామంలో సీఎం రేవంత్ పాదయాత్ర – అధికారుల ఏర్పాట్లు పూర్తి
ఈ నెల 8న మూసీ వెంట సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. నవంబర్ 8న ఆయన పుట్టిన రోజు సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి యాదాద్రి నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం ఆ జిల్లాలో పర్యటించనున్నారు. వలిగొండ మండలం సంగెం గ్రామంలో మూసీ వెంట నడుస్తూ పరిశీలించనున్నారు. ఈ మేరకు అధికారులు పూర్తి స్థాయి ఏర్పాటు చేస్తున్నారు.