Site icon PRASHNA AYUDHAM

నాందేడ్ ఎంపీ స్వర్గీయ వసంతరావు చావన్ చిత్రపటానికి నివాళులర్పించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

నాందేడ్
Headlines in Telugu
  1. నాందేడ్ ఎంపీ వసంతరావు చావన్ కుటుంబాన్ని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
  2. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి
  3. కాంగ్రెస్ అభ్యర్థుల విజయంపై ధీమా వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
  4. వసంతరావు ఆశయాలను కొనసాగించాలని సీఎం సూచనలు
  5. నిలువెత్తు నాయకుడిగా గుర్తింపు పొందిన వసంతరావు చావన్‌కు నివాళి

*కార్యక్రమంలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్..*

ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన నాందేడ్ ఎంపీ వసంత్ రావు చావన్ చిత్రపటానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నాయగవ్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,జూపల్లి కృష్ణారావు,జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్,మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్, TMREIS బోర్డు వైస్ చైర్మన్ మహ్మద్ ఫహీమోద్దీన్ ఖురేషి మరియు స్థానిక నాయకులతో కలిసి వసంతరావు చావన్ నివాసంలో వారి కుటుంబాన్ని పరామర్శించారు.

నాందేడ్ లోక్ సభతో పాటు నయగావ్ నియోజకవర్గంలో ఓటమెరుగని నేతగా ప్రజా పక్షపాతిగా అభివృద్ధి ప్రదాతగా అత్యుత్తమ సేవలందించి అభివృద్ధి బాటలో పయనింపచేసిన వసంత్రావు చావాన్ ఆశయాలను నాందేడ్ లోక్ సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వసంతరావు చవాన్ వారసుడు రవీంద్ర చవాన్, నాయగావ్ అసెంబ్లీ అభ్యర్థి మీనల్ పాటిల్ కొనసాగించాలని సీఎం సూచించారు.

మహారాష్ట్ర ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తే మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని సీఎం ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version