Headlines :
-
రైతులకు సంక్రాంతి గిఫ్ట్: రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
-
కాంగ్రెస్ రైతు భరోసా పథకం కొనసాగింపు: సీఎం రేవంత్ రెడ్డి
-
రైతు సంక్షేమంపై దృష్టి: రైతు ఖాతాల్లో త్వరలో నిధుల జమ
-
“మారీచుడు వచ్చినా రైతు భరోసా ఆగదు”: సీఎం రేవంత్ రెడ్డి
-
పంట పెట్టుబడి సాయం: ప్రతి ఎకరానికి రూ.15 వేల నిధులు
*తెలంగాణ రైతాంగానికి సీఎం రేవంత్ రెడ్డి భారీ గుడ్ న్యూస్ చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన రైతు భరోసా పథకంపై కీలక ప్రకటన చేశారు.*
తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనపై *సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.* ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. *కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా స్కీమ్‌ను కొనసాగిస్తోందని.. సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని* ప్రకటించారు. రైతు భరోసా స్కీమ్ విధివిధానాల కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ వేశామని.. కమిటీ రిపోర్టుపై శాసన సభలో చర్చించి రైతు భరోసా పథకం గైడ్ లైన్స్ ఖరారు చేస్తామని తెలిపారు. *రైతు భరోసా స్కీమ్ అలాగే కొనసాగుతోందని..* ఇందులో ఎవరికీ అనుమానం వద్దని క్లారిటీ ఇచ్చారు. *మారీచుడు వచ్చి అడ్డుకున్నా రైతు భరోసా ఆగదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ రూపంలో మారీచులు వస్తారని.. ఎవరూ ఆందోళన చెందవద్దని* ఎద్దేవా చేశారు. *కేసీఆర్ వరి వేస్తే ఉరి అన్నారని.. కానీ వ్యవసాయం దండగ కాదు పండగ చేస్తున్నామన్నారు.* కాగా, రైతులకు పంట పెట్టుబడి సాయం కింద *ఏడాదికి ఒక ఎకరానికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సహయం చేస్తామని* కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.