కామారెడ్డిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

కామారెడ్డిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ప్రశ్న ఆయుధం) నవంబర్ 8

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు భక్తిశ్రద్ధలతో వేడుకలను నిర్వహించారు. శనివారం కామారెడ్డి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతూ, ప్రజా పాలనకు ప్రతీకగా నిలుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజల మనసులను గెలుచుకున్నారు. ఆయనే తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న నాయుకుడు” అన్నారు. ప్రజాసేవలో ఆయనకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పంపరి శ్రీనివాస్, నిమ్మ విజయ్ రెడ్డి, జూలూరి సుధాకర్, పిడుగు సాయిబాబా మమత, సలీం, శంకర్ రావు, ఊర్దొండ రవి, చాట్ల వంశీ, హాయ్‌గడ్డమీది మహేష్, మామిళ్ల రమేష్, తాటి ప్రసాద్, బండారి శ్రీకాంత్, అరవింద్, బల్ల శ్రీనివాస్, కిరణ్, కోటేశ్వర్, రంగా రమేష్, రాములు, మెహర్ బాబా, యూత్ సభ్యులు నర్సుల మహేష్, మున్ను, గౌస్, శశి, హైమద్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సీనియర్ నాయకులు, తాజా మాజీ కౌన్సిలర్లు, యూత్ సభ్యులు ఈ వేడుకలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment