ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులతో ఆగస్టు 2న సీఎం రేవంత్ రెడ్డి సమావేశం!
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల పదోన్నతి పొందిన 30 వేల మంది ఉపాధ్యా యులతో సీఎం రేవంత్రెడ్డి సమావేశం కానున్నారు.
ఈ సమావేశ ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆగస్టు 2న ఎల్బీస్టేడి యంలో జరిగే సమావేశంలో పదోన్నతి పొందిన ఉపాధ్యా యులందరితో సీఎం నేరుగా మాట్లాడేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
ఇక ఎల్బీస్టేడియంలో దాదా పు రెయిన్ ప్రూఫ్ టెంట్లు వేయాలని అధికారులకు సూచించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే ఉపాధ్యాయు లకు సరైన పార్కింగ్, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
సమావేశ ప్రాంగణంలో అవసరమైన మంచినీరు, పారిశుధ్యం తదితర సౌకర్యాలు కల్పించాలని సూచించారు…