గత పాలకులు తెలంగాణ తల్లిని మరుగున పడేశారు: సీఎం రేవంత్
గత పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు తెలంగాణ తల్లిని మరుగున పడేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇవాళ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసి మాట్లాడారు. ‘నేనే తెలంగాణ అనేలా గత పాలకులు వ్యవహరించారు. డిప్యూటీ సీఎం భట్టి కేరళలో ఉండటం వల్ల హాజరు కాలేకపోయారు. డిసెంబర్ 9న విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం’ అని తెలిపారు.