కోటి మంది మహిళలను కోటీశ్వరులని చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం : సీఎం రేవంత్ రెడ్డి
కోటి మంది మహిళలతో సభ నిర్వహించి ప్రధానిని ఆహ్వానిస్తా
మహిళలు ఆర్థిక శక్తి ఉంటే కుటుంబం బాగుపడుతుంది.
పురుషుల దగ్గర ఆర్థిక వనరులు ఉంటే బెల్ట్ షాప్ కి పోతారు ఊరిలో గుడి ఎంత ముఖ్యమో
బడి అంతే ముఖ్యం
గుడిని బాగు చేసుకున్నట్టే బడిని బాగు చేసుకోవాలి మనం కష్టపడ్డట్టు మన పిల్లల కష్టపడద్దు నారాయణపూర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపూర్ జిల్లాలో పర్యటన లో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు డ్వాక్రా గ్రూప్ మహిళలకు తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ఆవిష్కరించి మహిళలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న విషయం గుర్తు చేశారు. మహిళల దగ్గర ఆర్థిక శక్తి ఉంటే తన పిల్లల చదువులు కుటుంబ బాధ్యతలు కుటుంబ గౌరవం పెరుగుతుందని అన్నారు 66 లక్షల మంది డ్వాక్రా గ్రూపు మహిళలు ఉన్నారని ఇది కోటి మందికి చేర్చాలన్నారు కోటి మందిని కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని త్వరలో హైదరాబాదులో కోటి మందితో సభ నిర్వహించి ప్రధాని నరేంద్ర మోడీని సభకు ఆహ్వానించి అభివృద్ధి అడుగుతామన్నారు. ప్రతి జిల్లాలో డ్వాక్రా మహిళలకు జిల్లాకు ఒకటి చొప్పున ప్రభుత్వ స్థలాలను ఇచ్చి పెట్రోల్ పంపులు ఇస్తామన్నారు. సంవత్సరానికి రెండు చీరలు చొప్పున డ్వాక్రా మహిళలకు 10 కోట్లతో చీరలు ఇస్తామని అవి జొన్న సజ్జ చేనులలో కట్టే చీరల్లా కాకుండా ఆడపడుచులకు ఇచ్చే ఆత్మగౌరంగ ఆ చీరలు ఉండనున్నట్లు తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరుని చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో ఉంటే తెలంగాణ ప్రగతిలో మరింత ముందుకు దూసుకుపోయేందుకు అవకాశం ఉంటుందన్నారు. మహిళలు దేనికి తక్కువ కాదని మహిళలు ఆత్మవిశ్వాసం నింపాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. డ్వాక్రా రుణాల ద్వారా పౌల్ట్రీలు మిల్క్ ప్రోడక్ట్లు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇలా మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ ఆర్థికంగా బలోపేతం అవుతున్నారని గత కెసిఆర్ పాలనలో డ్వాక్రా రుణాల్లో మస్కబారిపోయాను అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను ఆర్థిక భరోసా నింపుతుందని ప్రభుత్వాన్ని ఎప్పటికీ ఆదరిస్తూనే ఉండాలని కోరారు. ఎన్నికల్లో మాత్రమే రాజకీయాలు చేయాలని మిగతా రోజులలో అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి రాష్ట్రాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉందని అది కాకుండా రాజకీయం చేసుకుంటూ పోతే అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహాయం ఎంపీ అరుణమ్మతో కలిసి కోరుతామని తమ ప్రభుత్వానికి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న మన్నారు ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దామోదర్ రాజనర్సింహ తదితరులు పాల్గొన్నారు