Site icon PRASHNA AYUDHAM

కన్హా శాంతి వనంను సందర్శించిన సీఎం

*కన్హా శాంతి వనంను సందర్శించిన సీఎం*

కన్హా శాంతి వనంను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదివారం సందర్శించారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా గ్రామంలోని కన్హా శాంతివనంలో చిన్నారులు, విద్యార్థులకు అందించే సాఫ్ట్ స్కిల్స్ కు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని రంగులను గుర్తించడం, పదాలను చదవడం వంటి స్కిల్స్ ను అక్కడి విద్యార్థులు ప్రదర్శించడం చూసి ముఖ్యమంత్రి వారిని అభినందించారు. ఇలాంటి స్కిల్స్ ను ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్సియల్ స్కూల్స్ లోనూ అందించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. అనంతరం కన్హా శాంతివనం ఆవరణలోని ట్రీ కన్జర్వేషన్ సెంటర్ ను సందర్శించారు. వివిధ రకాల వంగడాల అభివృద్ధి, మొక్కల పెంపకానికి సంబంధించిన విధానాలను శాంతి వనం నిర్వాహకులు సీఎం కు వివరించారు. శాంతి వనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెయిన్ ఫారెస్ట్ ను సీఎం సందర్శించారు

. అనంతరం మెడిటేషన్ సెంటర్ వద్ద Galibuda (Scientific Name: Hildergardia Populifolia) మొక్కను నాటి మెడిటేషన్ హాల్ ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు,ఎమ్మెల్యె శంకరయ్య,ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Exit mobile version