గజ్వేల్ ను సందర్శించిన సీఎంవో జాయింట్ సెక్రెటరీ సంగీత నారాయణ ఐఏఎస్

అందరికీ ఫ్యామిలీ డిజిటల్ కార్డు అందించాలి

ఏ ఒక్క ఇంటిని మర్చిపోవద్దు

గజ్వేల్ అక్టోబర్ 5 ప్రశ్న ఆయుధం :

శనివారం గజ్వేల్ పట్టణంలోని 17 వార్డులో ఫ్యామిలీ డిజిల్ కార్డ్ కొరకు అధికారులు నిర్వహిస్తున్న కుటుంబ వివరాల నమోదు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరితొ కలిసి సిఎంఓ జాయుంట్ సెక్రటరి సంగీత సత్యనారాయణ(ఐఏఎస్) క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
సిఎంఓ జాయుంట్ సెక్రటరి మాట్లాడుతు….
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి అర్బన్, రూరల్ లో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన కుటుంబ వివరాలను అత్యంత పారదర్శకంగా ఏ ఓక్క ఇంటిని కూడా మరిచిపోకుండా సర్వే జరపాలని సూచించారు. ఈ వివరాల కోసం కుటుంబాలకు వెళ్ళినప్పుడు కుటుంబంలోని అందరి వివరాలు కరెక్ట్ గా ఉన్నాయో చుసుకుని ఒకవేళ కుటుంబంలో సభ్యులను చేర్చడం కానీ తీసివేయడం కాని జరిగితే వారి వివరాలను సపరేటు రాయడం తో పాటు మహిళను కుటుంబ పెద్దగా డిజిటల్ కార్డు మంజూరు చెయ్యడం జరుగుతుంది. ఈ మొత్తం సర్వే అక్టోబర్ 3వ తేదీ నుండి 8వ తేదీ వరకు 5 వర్కింగ్ డేస్ లలో నిర్వహిస్తున్నట్లు ఇప్పటివరకు జిల్లాలో దాదాపు 80 శాతంపైగా సర్వే పూర్తయినట్టు మిగతాది త్వరగా పూర్తిచేసి సర్వే రిపోర్ట్ ను పై స్థాయిలోకి పంపిస్తామని తెలియజేశారు.
వీరి వెంట ఆర్డిఓ బన్సీలాల్, మున్సిపల్ కమిషనర్, తాసిల్దార్లు, సర్వే సిబ్బంది, తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now