*CMR గడువు పొడిగించిన కేంద్రం*
కేంద్ర ప్రభుత్వం 2023-24 సంవత్సరం యాసంగి సీజన్కు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్స్ (CMR) గడువును పెంచింది. ఈనెల 15వ తేదీతో CMR గడువు పూర్తవడంతో అప్పటి నుంచి FCIతెలంగాణ నుంచి బియ్యం సేకరణను నిలిపేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. గతేడాది యాసంగి సీజన్కు సంబంధించిన బియ్యం డెలివరీకి నెలరోజుల అదనపు సమయం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది.