Site icon PRASHNA AYUDHAM

ఎస్‌ఎల్‌బీసీపై సీఎం దృష్టి

IMG 20250905 WA0016

ఎస్‌ఎల్‌బీసీపై సీఎం దృష్టి

2027 డిసెంబర్ 9 గడువులోగా ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

ప్రతి 3 నెలలకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచన

ఆర్మీ అధికారులు, సింగరేణి నిపుణుల సేవలు వినియోగించుకోవాలని నిర్ణయం

35 కి.మీ పూర్తయింది, 9 కి.మీ మిగిలింది, అత్యాధునిక టెక్నాలజీతో తవ్వకాలు

గ్రీన్ ఛానల్ నిధులు, హెలీ-బోర్న్ సర్వేతో పనులు వేగవంతం

హైదరాబాద్‌: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2027 డిసెంబర్ 9 నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని గడువు విధించారు. ఇకనుంచి ఒక్కరోజు కూడా పనులు ఆలస్యం కాకుండా చూడాలని ఆయన అధికారులు స్పష్టం చేశారు.

సచివాలయంలో జరిగిన సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటి పారుదల సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్‌తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సొరంగం పనుల్లో అనుభవం ఉన్న ఆర్మీ అధికారుల సేవలు వినియోగించాలని సీఎం సూచించారు. సింగరేణి నిపుణుల సలహాలు, వివిధ ఏజెన్సీల భాగస్వామ్యంతో యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగించాలని ఆదేశించారు. అటవీ శాఖ, ఇంధన శాఖ, ఇరిగేషన్ విభాగాలు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.

35 కి.మీ సొరంగం ఇప్పటికే పూర్తయి, మిగిలిన 9 కి.మీ తవ్వకాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించనున్నట్టు అధికారులు వివరించారు. కాంట్రాక్టు సంస్థ జేపి అసోసియేట్స్ అన్ని పరికరాలను సిద్ధం చేసుకోవాలని, ఇకపై పనుల్లో ఆలస్యం సహించబోమని సీఎం హెచ్చరించారు.

సొరంగం పనుల భద్రత కోసం ఎన్జీఆర్ఐ ద్వారా హెలీ-బోర్న్ సర్వే నిర్వహించనున్నట్టు నిర్ణయించారు. దీంతో ప్రమాదాలను ముందుగానే గుర్తించవచ్చని తెలిపారు.

ప్రాజెక్ట్ నిర్మాణం భవిష్యత్‌లో దేశ విదేశాల్లో టన్నెల్ ప్రాజెక్టులకు ఆదర్శంగా నిలవాలని సీఎం ఆకాంక్షించారు.

 

 

Exit mobile version