Site icon PRASHNA AYUDHAM

గుండెపోటుతో కోస్ట్ గార్డ్ డీజీ కన్నుమూత.

గుండెపోటుతో కోస్ట్ గార్డ్ డీజీ కన్నుమూత

ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్ గుండెపోటుతో ఆదివారం చెన్నైలో కన్నుమూశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెన్నై పర్యటనకు సంబంధించి ఐఎన్‌ఎస్ అడయార్ వద్ద అధికారులతో చర్చిస్తుండగా ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చింది. వెంటనే ఆయనను రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (RGGGH)కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు. గత ఏడాది జులైలో ఇండియన్ కోస్ట్ గార్డ్ 25వ డీజీగా ఆయన నియమితులయ్యారు.

Exit mobile version