రెంజల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నాగుపాము కలకలం..
నిజామాబాద్ ( ప్రశ్న ఆయుధం ) జిల్లా ప్రతినిధి డిసెంబర్ 28
రెంజల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం నాగుపాము కలకలం రేపింది. బాత్‌రూంలో పాము కనిపించడంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇవ్వడంతో అతను పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశాడు.