ప్రభుత్వ ఆసుపత్రుల నుండి వైద్యం పేరుతో పైసలు వసూలు చేస్తే సహించేది లేదు జిల్లా కలెక్టర్ జితేష్
ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్సి జూలై 24
ప్రభుత్వ ఆసుపత్రుల నుండి వైద్యం పేరుతో వైద్యులు లేక స్టాపు పైసలు దండుకుంటే సహించేది లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ హెచ్చరించారు. జిల్లా కార్యాలయంలో ఆయన పత్రిక ప్రకటన ద్వారా బుధవారం వెల్లడించారు.ముఖ్యంగా రామవరం చిన్నపిల్లల ఆసుపత్రి మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల నుండి పైసలు వసూలు చేసిన.చీదరించుకున్న,మందులు బయటకు రాసిన,రోగులను అవసరం లేకున్నా బయటకు రిఫర్ చేసిన కఠిన చర్యలు తప్పని జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వెల్లడించారు.