గండిమాసన్‌పేట వరి కొనుగోలు కేంద్రాన్ని పర్యవేక్షించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
పంట తేమ శాతం పరిశీలించిన అధికారులు
— రైతులకు స్పష్టమైన సూచనలు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 15
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం గండిమాసన్‌పేట గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పంట తేమ శాతంను ప్రత్యక్షంగా పరిశీలించి, రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలను, సమస్యలను తెలుసుకున్నారు. కలెక్టర్‌తో పాటు ఎల్లారెడ్డి డివిజన్ RDO పార్థ సింహ రెడ్డి, DCSO, DCO, DMCSC, తహశీల్దార్, MAO, పర్యవేక్షణ అధికారి, AEO, PACS యెల్లారెడ్డి చైర్మన్, CEO, రవాణా కాంట్రాక్టర్, సెంటర్ ఇన్‌చార్జ్ తదితరులు ఉన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ శుభ్రం చేసిన వరిని మాత్రమే PPCలో స్వీకరించాలని, సేకరించిన ధాన్యాన్ని ట్యాగ్ చేసిన రైస్ మిల్లులకు సమయానికి పంపాలని సూచించారు. TAB ఎంట్రీలు PPC వారీగా సక్రమంగా నమోదు కావాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్రాలు పనిచేయాలన్నారు.
రైతులకు కీలక సూచనలు:
PPCకి తీసుకురాకముందు వరిని తప్పనిసరిగా శుభ్రం చేయాలి.
17% లోపు తేమ శాతం ఉన్న ధాన్యాన్నే తీసుకురావాలి.
తూకం వేయించే ముందు పంట తేమను పరిశీలించుకోవాలి.
నాణ్యమైన ధాన్య సేకరణ, పారదర్శకత కోసం PACS సొసైటీ యెల్లారెడ్డి CEO, సెంటర్ ఇన్‌చార్జ్‌లకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.