గాంధారి మండలంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పర్యటన

గాంధారి మండలంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పర్యటన

వండ్రికల్ గ్రామంలో ఆర్&బీ రోడ్డుపై కల్వర్ట్ పరిశీలన

గుర్జాల్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల తనిఖీ

పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ, మొక్కలు నాటడం

వంటశాల పరిశీలించి నాణ్యమైన భోజనం అందించాలని సూచన

ప్రశ్న ఆయుధం గాంధారి, సెప్టెంబర్ 16

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం గాంధారి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. వండ్రికల్ గ్రామంలో ఆర్&బీ రోడ్డుకు సంబంధించిన బ్రిడ్జి కల్వర్ట్‌ను పరిశీలించారు. అనంతరం గుర్జాల్ గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల పనులను తనిఖీ చేశారు.

గ్రామ పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేసి, పాఠశాల ఆవరణలో మొక్క నాటారు. వంటశాలను పరిశీలించిన కలెక్టర్, పిల్లలకు నాణ్యమైన ఆహారం వండి, శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సిబ్బందికి సూచించారు.

ఈ పర్యటనలో డిపిఓ మురళీ, డిఎల్పిఓ సురేందర్ ఎల్లారెడ్డి, ఎంపిడిఓ రాజేశ్వర్, ఎమ్మార్వో రేణుక చౌహన్, ఎంపీఓ లక్ష్మీనారాయణ, హౌసింగ్ పిడి విజయ్ పాల్ రెడ్డి సహా మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment