నందివాడ జెడ్పీ హైస్కూల్‌లో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ సందర్శన

నందివాడ జెడ్పీ హైస్కూల్‌లో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ సందర్శన

విద్యార్థులందరూ 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ ఆదేశం

వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచన

మెనూ ప్రకారం నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలన్న స్పష్టమైన హెచ్చరిక

పాఠశాల పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి

విద్యా, ఆరోగ్య పరిరక్షణలో సమన్వయం అవసరమని అధికారులకు సూచన

కామారెడ్డి జిల్లా ప్రతినిధి తాడ్వాయి, అక్టోబర్ 22 (ప్రశ్న ఆయుధం):

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని నందివాడ గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం సందర్శించారు. విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడిన ఆయన, పదో తరగతి విద్యార్థులు శ్రమించి వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు సన్నద్ధం కావాలని ప్రోత్సహించారు.

కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల నమోదు పెంపు, వెనుకబడిన విద్యార్థుల గుర్తింపు, వారికి ప్రత్యేక బోధన తరగతులు నిర్వహించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. సిలబస్ పూర్తయిన స్థితి, బోధన విధానాలు, విద్యార్థుల ప్రగతి వంటి అంశాలను వివరంగా ఆరా తీశారు.

అనంతరం MDM (మధ్యాహ్న భోజనం) నాణ్యతను పరిశీలించిన కలెక్టర్, మెనూ ప్రకారం నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం విద్యార్థులకు అందించాలన్నారు. వంట సమయంలో, వడ్డింపులో శుభ్రత పాటించడం తప్పనిసరి అని హెచ్చరించారు.

పాఠశాల ప్రాంగణం శుభ్రంగా ఉండేలా, స్లాబ్‌పై పేరుకుపోయిన చెత్తను శానిటేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కలెక్టర్ వెంట డీఈఓ రాజు, ఎంఈఓ రామస్వామి, ఎంఆర్ఓ శ్వేత, ఎంపీడీవో సయ్యద్ సాజిద్ అలీ, ఎంపీవో సవితా రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment