అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

ఆంగన్ వాడీ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ..

 

సూపర్వైజర్ లు, సి.డి.పి.ఒ. లు అంగన్ వాడీ కేంద్రాలను పర్యవేక్షణలు చేయాలని, ఆంగన్ వాడీ కేంద్రాల పిల్లల హాజరు శాతం పెంచాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం రోజున సదాశివనగర్ మండలం ఆడ్లూర్ ఎల్లారెడ్డి లోని ఆంగన్ వాడీ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు రిజిస్టర్ లను పరిశీలించి, కేంద్రంలోని ప్రతీ ఒక్క పిల్లలు తప్పనిసరిగా హాజరయ్యే విధంగా అంగన్ వాడీ టీచర్, సూపర్వైజర్ లు పర్యవేక్షణ చేయాలని అన్నారు. విద్యార్థుల బరువు, ఎత్తు లను కలెక్టర్ పరిశీలించారు. తక్కువ బరువు గల విద్యార్థులను గుర్తించి పౌస్టికాహారం అందించాలని తెలిపారు. కేంద్రంలోని పిల్లలకు ఆట,పాటలను నేర్పించాలని, మంచి విద్యాబుద్దులు నేర్పించాలని తెలిపారు. కేంద్రాలలో పిల్లలు తప్పని సరిగా హాజరయ్యే విధంగా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం కేంద్రంలోని పిల్లలకు, బాలింతలు, గర్భిణీలకు అందిస్తున్న భోజనం లను కలెక్టర్ వంట గది లో పరిశీలించారు. భోజనానికీ ముందు విద్యార్థులు వారి చేతులను కడిగే పద్ధతులను కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని పంచాయతీ కార్యదర్శి కి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రంగనాథ్ రావు, జడ్పీ సీఇఓ చందర్, సూపర్వైజర్, సి.డి.పి.ఒ. పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now