వరి కొనుగోళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్ సూచనలు

వరి కొనుగోళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్ సూచనలు

కరడ్‌పల్లి పర్చేజ్ సెంటర్‌ను ఆకస్మికంగా పరిశీలించిన ఆశిష్ సాంగ్వాన్

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం డిసెంబర్ 3

 బుధవారం: ఖరీఫ్ వరి కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. తాడ్వాయి మండలం కరడ్‌పల్లి వరి కొనుగోలు కేంద్రం (PPC Karadpalle)ను ఆయన బుధవారం సందర్శించారు. PACS ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కేంద్రంలో కొనుగోలు ప్రక్రియ, రైతుల రాకపోకలు, గన్నీస్ అందుబాటు, తూకం, రవాణా సదుపాయాలు తదితర అంశాలను కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. గత ఏడాది ఖరీఫ్ 2024–25లో ఈ కేంద్రంలో 4064.40 క్వింటాళ్ల వరి కొనుగోలు కాగా, 118 మంది రైతులు లాభం పొందారు. ఈసారి ఖరీఫ్ 2025–26లో 506 ఎకరాల్లో సాగు, 421 మంది రైతులు, సుమారు 12,650 క్వింటాళ్ల ఉత్పత్తి ఆశిస్తున్నట్లు అధికారులు వివరించారు. ఇప్పటివరకు (02.12.2025 నాటికి) 604 క్వింటాళ్లు కొనుగోలు చేయగా, 310.40 క్వింటాళ్లు మిల్లులకు మార్చినట్లు తెలిపారు. PPC మొత్తం కేటాయింపు 3000 క్వింటాళ్లు. కుచద్రి వెంకటేశ్వర రైస్ మిల్‌కు 2000 క్వింటాళ్లు, శ్రీ సాయిమాణికంఠ ఇండియాకు 1000 క్వింటాళ్లు కేటాయించబడినట్లు అధికారులు తెలిపారు. గన్నీస్ మొత్తం 9000 అందగా, 1510 వినియోగించి 7490 బ్యాలెన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. రవాణా కాంట్రాక్టర్ ద్వారా లోడింగ్ సక్రమంగా జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా పారదర్శకంగా, వేగవంతంగా కొనుగోళ్లు జరగాలని సూచించారు. అనంతరం గ్రామస్థులు ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్, జడ్‌పి పాఠశాల త్రాగునీరు–టాయిలెట్స్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తహసిల్దార్‌కు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్‌తో పాటు సివిల్ సప్లై కార్యదర్శి వెంకటేశ్వర్లు, DM శ్రీకాంత్, CPO, తహసిల్దార్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment