భద్రాచలం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన కలెక్టర్

500x300 1456325 jitesh

మూడవ ప్రమాద హెచ్చరిక జారి… జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ఎ డతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకారంగా గోదావరి పరివాహక ప్రాంతంలో వరద ప్రవాహం క్రమేపి పెరుగుతూ వస్తున్నదని ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణం వద్ద 28.07.24 సాయంత్రం 4:16 గంటలకు నీటి ప్రవాహం 53 అడుగుల స్థాయికి చేరుకోవడంతో మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు జిల్లా యంత్రాంగపు సలహాలు, సూచనలు పాటించాలని చెప్పారు. అధికార యంత్రాంగం, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రజలు ఇళ్ళ నుండి బయటకి రావొద్దని, అత్యవసర సేవలకు కంట్రోల్ రూము నంబర్లు కు కాల్ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now