Site icon PRASHNA AYUDHAM

ప్రజావాణిలో దరఖాస్తులకు పరిష్కారం మార్గం చూపాలి

ప్రజావాణిలో
Headlines :
  1. ప్రజావాణిలో దరఖాస్తులకు పరిష్కారం మార్గం చూపాలి
  2. కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశాలు
  3. ప్రతి దరఖాస్తును పరిశీలించి చర్యలు తీసుకోండి

జిల్లా కలెక్టర్ ఆదేశం

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు.ఈ సందర్భంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులను వివరాలను అడిగి తెలుసుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ శాఖల వారీగా అధికారులను ఆదేశించారు.
గ్రీవెన్స్ లో కొన్ని ఫిర్యాదులు..
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని నివాసం ఉంటున్న వికలాంగుడైన ఆగుళ్ళ మల్లేశం లోగడ వికలాంగుల కోటా కింద ప్రభుత్వం వారు టెలిఫోన్ బూత్ మంజూరు చేశారని తెలిపారు.రాను రాను సెల్ ఫోన్ వాడకం పెరగడంతో టెలిఫోన్ బూత్ నడవక పూర్తిగా మూసివేయడం జరిగిందని, అదే ప్రదేశంలో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నానని,రైతు బజార్ నూతన నిర్మాణంలో భాగంగా నా యొక్క డబ్బాను పూర్తిగా తొలగించడం వల్ల రోడ్డున పడ్డానని, కావున దయ తలచి నూతనంగా నిర్మిస్తున్న వ్యాపార సముదాయంలో ఒక గదిని కేటాయించాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యల నిమిత్తం కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ కు ఎండార్స్ చేశారు.పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని గట్టాయిగూడెం ఏడవ వార్డు లో నివాసం ఉంటున్న కాల్వ సూర్యకాంతమ్మ తండ్రి పట్టా భిక్షం సర్వేనెంబర్ 712/అ /నాలో 12 ఎకరాల 26 కుంటల సొంత పొలం ఉన్నదని, ఆ పొలంలో మున్సిపల్ అధికారులు రోడ్డు శాంక్షన్ అయినదని, సొంత స్థలంలో గవర్నమెంట్ రోడ్డు వేయడం పై తగు చర్యలు తీసుకోవాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం మున్సిపల్ కమిషనర్ పాల్వంచకు ఎండార్స్ చేశారు.ఇల్లందు నియోజకవర్గ కామేపల్లి మండలం ఊటుకూరు గ్రామం లో నివసిస్తున్న వడ్లకొండ బిక్షం తండ్రి రామయ్య తనకు మూడు ఎకరాల పోడు భూమి ఉన్నదని దానిని గత 56 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, తన పెద్ద కుమారుడు భార్య చనిపోవడం వల్ల గత ఎనిమిది నెలల నుండి సాగు చేయడం లేదని, దానిని అదునుగా చేసుకొని ఫారెస్ట్ అధికారులు తమ భూమినిస్వాధీనం చేసుకున్నారని, తనకు న్యాయం చేయాలని చేసుకున్న దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం ఐటీడీఏ పీవోకు ఎండార్స్ చేశారు. బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో నివాసం ఉంటున్న శ్రీరాముల సక్కుబాయి భర్త వీరస్వామి తను కూలీనాలీ చేసుకుని సారపాక సుందరయ్య నగర్ కాలనీలో 3.48 సెంట్లు ఇంటి స్థలం కొనుగోలు చేసుకున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు పథకం కింద తమను చేర్చాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం హౌసింగ్ డిపార్ట్మెంట్ కు ఎండార్స్ చేశారు. జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామపంచాయతీలో గత కొన్ని రోజులుగా పారిశుధ్య కార్మికులకు జీతాలు రాకపోవడంతో వారు విధులకు హాజరు కాకపోవడం వలన గ్రామపంచాయతీలో పాఠశాలలు మరియు హాస్పిటల్స్ వద్ద దుర్వాసన రావడంతో విద్యార్థులు గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్నారని భారతీయ గౌడ బంజారా పోరాట సమితి వారు చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ వెంటనే పారిశుద్ధ్య పనులు చేపట్టి నివేదిక సమర్పించాలని జూలూరుపాడు ఎంపీడీవో నీ ఆదేశించారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version