ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా గ్రంథాలయాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు,పుస్తకాలను పరిశీలించారు. విద్యార్థుల కు కల్పిస్తున్న సౌకర్యాలు,గ్రంథాలయం లో పుస్తకాలు చదువుకోవటానికి గాను శాశ్వత సభ్యత్వం ఎంత, విద్యార్థులకు ఇచ్చే పుస్తకాలను రిజిస్టర్ మైంటైన్ చేస్తున్నారా లేదా తదితర వివరాలను గ్రంథాలయ అధికారిని అడిగి తెలుసుకున్నారు.గ్రంథాలయంలో స్టోర్ రూమ్ లోని పుస్తకాలను పరిశీలించారు. స్టోర్ రూమ్ కురుస్తుందా, మరుగుదొడ్లు, ఫ్యాన్లు లైట్లు ఇతర సౌకర్యాలు ఉన్నాయని ఆరా తీశారు.పుస్తకాలకు ఇన్ వర్డ్ నెంబర్ ఉన్నదా లేదా అని తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గ్రంథాలయంలో ఎంతో విలువైన మరియు పురాతనమైన పుస్తకాలు ఉన్నాయని, వాటిని సరైన పద్ధతిలో భద్రపరచాలని సూచించారు. గ్రంథాలయంలో పుస్తకాలు భద్రపరచడానికి గాను గోడకి అలమారాలు ఏర్పాటు చేయాలని, పుస్తకాలు శుభ్రపరచడానికి వ్యాక్యూమ్ క్లీనర్ లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.అనంతరం కొత్తగూడెం తెలంగాణ భవన్ ప్రక్కన నూతనంగా నిర్మించిన గ్రంథాలయభవనాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పుస్తకాలు చదివేలా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. గ్రంధాలయంలో పుస్తకాలను పోటీ పరీక్షలు, గ్రంధాలు, నవలలు తదితర వాటిని విభజించి అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.నూతన గ్రంథాలయంలో మిషన్ భగీరథ అధికారుల ద్వారా పైప్ లైన్ ఏర్పాటు చేసి సంపు ద్వారా తాగునీటి ట్యాంకును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సుదూరం నుండి విద్యార్థులు చదువుకోవడానికి గ్రంథాలయానికి వస్తారని, మహిళా సంఘాల ద్వారా వారికి అందుబాటులో 20 రూపాయలకే భోజనం క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని అన్నారు. గ్రంథాలయ వార్షికోత్సవల సందర్భంగా విద్యార్థులు మరియు యువత పెద్ద ఎత్తున గ్రంథాలయాలకు వచ్చి మన పురాతన గ్రంథాలను, పుస్తకాలను చదివి వాటి యొక్క ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ శేషాంజన స్వామి, జిల్లా గ్రంథాలయ అధికారి ఏం నవీన్ కుమార్, లైబ్రేరియన్ శ్రీమతి. జి. మృదులామణి మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.