ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ మను చౌదరి

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ మను చౌదరి

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 1

ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు జాప్యం లేకుండా పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి ఆదేశించారు.

సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్, అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, విజయేందర్ రెడ్డిలతో కలిసి మొత్తం 88 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలు ఎంతో నమ్మకంతో తమ సమస్యలను చెప్పుకోవడానికి వస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అధికారులందరిపైనా ఉందని స్పష్టం చేశారు. దరఖాస్తుల పరిశీలనలో ఎటువంటి ఆలస్యం ఉండకూడదని ఆయన హెచ్చరించారు.

అలాగే, తిరస్కరించబడిన దరఖాస్తుల విషయంలో తిరస్కరణకు గల కారణాలను అర్జీదారులకు తప్పనిసరిగా వివరించాలని కలెక్టర్ సూచించారు. స్వీకరించిన దరఖాస్తులపై తీసుకున్న చర్యలను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment