విద్యార్థుల ఆరోగ్యం, విద్యపై శ్రద్ధ వహించాలని కలెక్టర్ మను చౌదరి సూచనలు

విద్యార్థుల ఆరోగ్యం, విద్యపై శ్రద్ధ వహించాలని కలెక్టర్ మను చౌదరి సూచనలు

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం ఆగస్టు 5

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి, విద్యార్థులకు పరిశుభ్రమైన పౌష్టికాహారం అందించి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కుషాయిగూడలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.తనిఖీలో విద్యార్థుల సంఖ్య, స్టోర్ రూమ్, వంటగది, ఆహారం నాణ్యతను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థుల స్టడీ అవర్‌లో పాఠ్య విషయాలపై, ఆటలపై, భవిష్యత్తు లక్ష్యాలపై ఆరా తీశారు. వ్యక్తిత్వ వికాసంపై ప్రేరణాత్మక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు ఒత్తిడి లేకుండా చదవాలని, వెనుకబడిన సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి లక్ష్యాన్ని సాధించుకోవాలని ప్రోత్సహించారు. హైస్కూల్ విద్యను భవిష్యత్తు విజయానికి తొలిమెట్టు, లక్ష్య సాధనకు దిక్సూచి అని పేర్కొన్నారు.

మెనూ ప్రకారం అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనం, స్నాక్స్ అందుతున్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్న ఆయన, సమస్యలు ఉంటే నివేదించమని సూచించారు. విద్యార్థుల సమస్యలపై నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ తనిఖీలో జిల్లా మైనార్టీ అధికారి కాంతమ్మ, కాప్రా ఎమ్మార్వో సుచరిత, ప్రిన్సిపల్ సునీత రాణి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment