సివిల్స్ చేయాలనుకునే విద్యార్థులకు మార్గనిర్దేశం అందిస్తానని కలెక్టర్ మను చౌదరి

సివిల్స్ చేయాలనుకునే విద్యార్థులకు మార్గనిర్దేశం అందిస్తానని కలెక్టర్ మను చౌదరి

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రక్షణ ఆయుధం ఆగస్టు 11

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు మిక్కిలినేని మను చౌదరి, సివిల్స్ చేయాలనుకునే విద్యార్థులకు అవసరమైన మార్గనిర్దేశం, మెటీరియల్ అందిస్తానని, ఎప్పుడైనా అందుబాటులో ఉండి సలహాలు, సూచనలు ఇస్తానని తెలిపారు. దీనికోసం విద్యార్థులకు తన ఈ-మెయిల్ ఐడీని కూడా అందజేశారు.

సోమవారం కీసర మండలం అంకిరెడ్డిపల్లిలోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ & జూనియర్ కాలేజీని కలెక్టరు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సంఖ్య, భవనం అద్దె, నీటి సమస్య, చిన్న చిన్న మరమ్మత్తుల అవసరం వంటి అంశాలపై ప్రిన్సిపల్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. అద్దె పెంపు, నీటి సమస్యపై ఎస్టిమేషన్ నివేదికలను పంపాలని సూచించారు.

అనంతరం ఎం.ఇ.సి. సెకండ్ ఇయర్ విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టరు, గణితం, కామర్స్, ఎకనామిక్స్ పాఠాలపై అవగాహన కల్పించడంతో పాటు స్టాక్ మార్కెట్, బ్యాంకింగ్, షేర్స్, టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ వంటి అంశాలను బోధించారు. బాగా చదివి, భవిష్యత్తులో ఉద్యోగ, వ్యాపార రంగాలలో ముందుకు సాగాలని సూచించి, అవసరమైన సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. వ్యక్తిత్వ వికాసంపై విలువైన సూచనలు చేశారు.

ఆహారపు మెనూ ప్రకారం భోజనం, అల్పాహారం, స్నాక్స్ అందుతున్నాయా అని ఆరా తీశారు. స్టోర్‌లోని వంట సామాగ్రిని పరిశీలించి, ఎక్స్‌పైరీ డేట్‌లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు.

ఈ పర్యటనలో కీసర ఎంఆర్ఓ అశోక్, ప్రిన్సిపల్ రాజమణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now