ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చొరవ అవసరమని కలెక్టర్ ఆదేశాలు

ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చొరవ అవసరమని కలెక్టర్ ఆదేశాలు

ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 8,కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 73 అర్జీలు స్వీకరించబడ్డాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) చందర్ హాజరై ప్రజల సమస్యలు వినిపించారు.

కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి, తక్షణమే పరిష్కారం చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now