Site icon PRASHNA AYUDHAM

బుంగ పడ్డ చెరువుపై కలెక్టర్ పర్యవేక్షణ

IMG 20250828 235624

బుంగ పడ్డ చెరువుపై కలెక్టర్ పర్యవేక్షణ

బివిపేట మండల కేంద్రంలోని పెద్ద చెరువులో బుంగ పడి ప్రజల్లో ఆందోళన

కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ స్వయంగా ఘటనాస్థలానికి చేరుకున్నారు

ఎస్డిఆర్ఎఫ్, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమీక్ష

బుంగ మూత పనులు అత్యవసరంగా పూర్తి చేయాలని ఆదేశాలు

ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిక

బివిపేట మండల కేంద్రంలోని పెద్ద చెరువులో బుంగ పడి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పరిస్థితిని అంచనా వేసేందుకు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ గురువారం చెరువు వద్దకు చేరుకుని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్డిఆర్ఎఫ్, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో సమీక్ష జరిపారు.బుంగ మూత పనులు తక్షణమే పూర్తి చేసి ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. చెరువు పక్కనున్న గ్రామాల ప్రజలకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వాలని సంబంధిత శాఖలకు సూచనలు జారీ చేశారు. ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే తక్షణమే రక్షణ చర్యలు ప్రారంభించేలా యంత్రాంగం సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

Exit mobile version