ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కలెక్టర్ పుష్
వేగంగా పూర్తి చేయాలంటూ అధికారులకు ఆదేశాలు
కామారెడ్డి రాజానగర్‌లో పర్యటించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
బెస్ట్ మెట్ దశకు బిల్లులు మంజూరైందా? లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు
ఇసుక, మొరం ఉచితం… రవాణా ఖర్చుతో లబ్ధిదారులే తెచ్చుకోవాలి
నిర్మాణాల్లో నాణ్యతపై గట్టి దృష్టి పెట్టాలని సూచన
రెగ్యులర్ పర్యవేక్షణ చేపట్టాలని హౌసింగ్ పీడీ, కమిషనర్‌కి ఆదేశాలు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) ఆగష్టు7
కామారెడ్డి పట్టణంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన రాజా నగర్ కాలనీలో పర్యటించి నిర్మాణ ప్రగతిని సమీక్షించారు.
బెస్టుమెట్ దశకు చేరిన ఇళ్లకు బిల్లులు మంజూరయ్యాయా? అని కలెక్టర్ స్వయంగా లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఇసుక, మొరం ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ‘‘రవాణా ఖర్చులు మీరు భరించాల్సి ఉంటేనేగానీ, నిర్మాణంలో నాణ్యతపై మాత్రం రాజీ ఉండకూడదు’’ అని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ దశలను బట్టి బిల్లుల చెల్లింపు జరుగుతుందన్న ఆయన, ఇళ్ల నిర్మాణ సాగు అడ్డంకులు లేకుండా హౌసింగ్ పీడీ విజయ్ పాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డిని ప్రత్యేకంగా ఆదేశించారు. మార్కౌట్ అయిన ఇండ్లన్నింటికీ వెంటనే నిర్మాణం ప్రారంభించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) చందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.