Site icon PRASHNA AYUDHAM

మాక్లూర్ మండలంలో నర్సింగ్ కళాశాలను సందర్శించిన: కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

నర్సింగ్
Headlines
  1. మాక్లూర్ నర్సింగ్ కళాశాలను సందర్శించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
  2. నర్సింగ్ కళాశాలలో సదుపాయాలపై కలెక్టర్ దృష్టి
  3. మాక్లూర్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ తో మాట్లాడిన కలెక్టర్
  4. నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్ కలెక్టర్‌తో పాటు నర్సింగ్ కళాశాల సందర్శన
  5. మాక్లూర్ నర్సింగ్ కళాశాలలో సక్రమంగా తరగతులు కొనసాగుతున్నాయా? అడిగిన కలెక్టర్
మాక్లూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం సందర్శించి సదుపాయాలను పరిశీలించారు. కళాశాల ప్రిన్సిపాల్ ను, నర్సింగ్ విద్యార్థినులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అడ్మిషన్లు పూర్తయ్యాయా ? తరగతులు సక్రమంగా కొనసాగుతున్నాయా? అని ఆరా తీశారు. ప్రహరీ, రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలను పంపించాలని, అలాగే నిధులు మంజూరైన పనులను వెంటనే ప్రారంభించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ శాంతి తదితరులున్నారు.
Exit mobile version