Site icon PRASHNA AYUDHAM

ఎస్.ఎస్.ఆర్. ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించిన జిల్లా కలెక్టర్..

ఓటరు
Headlines
జిల్లా కలెక్టర్ ఎస్.ఎస్.ఆర్. ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించారు
2025 ప్రత్యేక సమ్మరీ రివిజన్ కింద ఓటరు జాబితా విడుదల
అభ్యంతరాలు 28 నవంబర్ 2024లోగా సమర్పించాలి
నవంబర్ 9, 10 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్ ఏర్పాటు
ఫైనల్ పబ్లికేషన్ జనవరి 6, 2025న ప్రకటించనున్నారు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 29:

స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 కు సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. మంగళవారం రోజున కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్.ఎస్.ఆర్. ముసాయిదా ఓటరు జాబితా ఈ రోజు ప్రకటించడం జరిగిందని, అట్టి జాబితాలో అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉంటే 28 నవంబరు 2024 లోగా సమర్పించవచ్చని, అట్టి వాటిని పరిశీలించి సంబంధిత అధికారులు డి చేస్తారని తెలిపారు. నవంబరు 9, 10 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అట్టి వాటిలో వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి డిసంబర్ 24 తేదీలోగా డిస్పొజల్ చేయడం జరుగుతుందని తెలిపారు. జనవరి 6, 2025 రోజున ఫైనల్ పబ్లికేషన్ ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. జనవరి 1, 2025 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరి పేరు ఓటరుగా నమోదు చేయవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ( రెవిన్యూ) వి.విక్టర్, ఆర్డీఓ రంగనాథ్ రావు, తహసీల్దార్ జనార్ధన్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Exit mobile version