కలెక్టర్ సార్..ఎందుకీ ఆలస్యం..? రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కి వినతి పత్రం..

కలెక్టర్ సార్..ఎందుకీ ఆలస్యం..

మెడికల్ కళాశాల పొరుగుసేవల అవకతవకలపై విచారణలో జాప్యం ఎందుకు.

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కి వినతి పత్రం..

నీల నాగరాజు

బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు.

చౌహాన్ వినోద్ నాయక్

గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు.

జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఆవరణలో గల అంబేద్కర్ విగ్రహానికి పొరుగుసేవల ఉద్యోగ నియామకాల అవినీతిపై విచారణలో జాప్యాన్ని నిరసిస్తూ వినతి పత్రం అందజేత.

అవుట్ సోర్సింగ్ నియామకాల అవినీతిపై గత 25 రోజులుగా పోరాటం చేస్తున్న జిల్లా కలెక్టరు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం దారుణమన్నారు.విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బాధిత అభ్యర్థులతో కలిసి కామారెడ్డి మ్యాన్ పవర్ ఏజెన్సీ అక్రమాలపై ఋజువులతో సహా కలెక్టర్ కి 2,3 సార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని,విచారణ చేపిస్తామనడం చెప్పడం తప్ప ఎలాంటి న్యాయం జరగడం లేదన్నారు.

గత 3 రోజుల క్రితం డీఎంఈ ని కలిసి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్,కామారెడ్డి మ్యాన్ పవర్ ఏజెన్సీ కుమ్మక్కు అవినీతిపై వినతి పత్రం ఇస్తూ మాట్లాడినప్పుడు కలెక్టర్ తో కలిసి విచారణ కమీషన్ వేయించి సరియైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పడం జరిగిందన్నారు.

నోటిఫికేషన్ వెలువడిన సమయం నుండి మెరిట్ లిస్ట్ పెట్టకముందే జాబ్ ఆర్డర్ కాపీ ఇచ్చిన సమయం వరకు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్,వ్యక్తిగత సిబ్బంది మరియు కామారెడ్డి మ్యాన్ పవర్ ఏజెన్సీ నిర్వాహకుడు,సిబ్బంది ఫోన్ పే,గూగుల్ పే,ఆన్లైన్ లావాదేవీలపై విచారణ జరిపితే అన్నీ బయటపడతాయన్నారు.అలాగే జాబ్ పొందిన వారి యొక్క ధ్రువపత్రాలను సంబంధిత శాఖ నుండి నేరుగా తెప్పిస్తే అసలు బాగోతం మొత్తం బయటపడుతుందన్నారు.

ఇన్ని అవకాశాలు ఉన్ననూ ఇప్పటికీ ఇంకా ఎలాంటి విచారణ జరగడం లేదని తెలిసిందని,ఇలాగే విచారణలో జాప్యం చేస్తే మాత్రం కామారెడ్డి లోని వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులతో కలిసి కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో లావుడ్య రవి,అరవింద్,సురేష్,సంజయ్,గణేష్,పీర్యా,మహేష్

తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now