వరి కొనుగోలు కేంద్రంపై కలెక్టర్ ఆకస్మిక దాడి
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 27
గురువారం
మాచారెడ్డి మండలం సోమవారం పేట్ గ్రామ పంచాయితీ పరిధిలోని నెమలిగుట్ట తాండాలో ఉన్న వరి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా వరి స్వీకరణ విధానం, తూకాల యంత్రాల పని తీరు, నిల్వ సౌకర్యాలు, రైతులకు అందిస్తున్న సేవలు, బిల్లుల జారీ, లోడింగ్ కార్యక్రమాలను సమగ్రంగా పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రైతుల సమస్యలను నేరుగా తెలుసుకున్న కలెక్టర్, వెంటనే పరిష్కారం కోసం శాఖాధికారులకు సూచనలు జారీ చేశారు. వరి కొనుగోలు కేంద్రాల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని ఆయన తెలిపారు. తనిఖీలో గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సురేందర్, సివిల్ సప్లై అధికారి వెంకటేశ్వర్లు, డీఎమ్ శ్రీకాంత్, తహసిల్దార్ సరళ, ఎంపీడీవో శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.