పాల్వంచలో కలెక్టర్ పర్యటన

పాల్వంచలో కలెక్టర్ పర్యటన

బ్రిడ్జి మరమ్మతులు వేగవంతం చేయాలి – కలెక్టర్ ఆదేశం

కామారెడ్డి, సెప్టెంబర్ 01 (ప్రశ్న ఆయుధం):

గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కామారెడ్డి–సిరిసిల్ల మార్గంలోని పాల్వంచ బ్రిడ్జి దెబ్బతింది. దీంతో రాకపోకలు ఆగిపోవడంతో సోమవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తాత్కాలిక రహదారిని ఉపయోగించి రాకపోకలు ప్రారంభించేలా మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ ఈఈ మోహన్‌ను ఆదేశించారు. రాబోయే రెండు మూడు రోజుల్లో భారీ వర్ష సూచన ఉన్నందున రహదారి భద్రతకు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

తదుపరి ఆయన పల్వంచ గ్రామంలో పరిశీలన చేసి, సానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీడీవోకు ఆదేశించారు. వర్షాల వల్ల కూలిన ఇండ్లను పరిశీలించి, ఆర్థిక సహాయం బిల్లులు తక్షణమే పంపాలని తహసీల్దార్‌ను ఆదేశించారు.

జిల్లాలో వర్షాలు మరింత ఉధృతం అయ్యే అవకాశం ఉందని, ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావొద్దని సూచించారు.

అంగన్వాడీ కేంద్రాన్ని కూడా సందర్శించిన కలెక్టర్, వంటగదిని పరిశీలించి పిల్లలకు పరిశుభ్రంగా వేడి పౌష్టికాహారం అందించాలని సూచించారు. చిన్నారులను ఎత్తుకొని ముద్దాడిన కలెక్టర్ స్నేహభావాన్ని ప్రదర్శించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment