ఈవీఎంల గోడౌన్ను పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 5
సాధారణ తనిఖీలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఈవీఎం గోడౌన్ ను సందర్శించి ఈవీఎంల సెక్యూరిటీని పరిశీలించారు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సాధారణ తనిఖీలో భాగంగా ఈవీఎం. గోడౌన్ పరిశీలించి ఈవీఎంల భద్రత కోసం తీసుకున్న చర్యలను పర్యవేక్షించడం జరిగిందని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలిపారు.
కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, కామారెడ్డి ఆర్డిఓ వీణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.