జీ.పీ.ఓ, లైసెన్స్డ్ సర్వేయర్ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 27 (ప్రశ్న ఆయుధం న్యూస్): గ్రామ పాలన అధికారులు (జీపీఓ), లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకం కోసం సంగారెడ్డి జిల్లా కేంద్ర లోని ప్రభుత్వ తారా డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ పి.ప్రావీణ్య పరిశీలించారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. అభ్యర్థుల హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగా, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు కొనసాగిన గ్రామ పాలన అధికారి పరీక్షకు. 77 మంది అభ్యర్థులకు గాను, 62 మంది హాజరయ్యారని, 15 మంది గైర్హాజరు అయినట్లు కలెక్టర్ తెలిపారు. లైసెన్స్డ్ సర్వేయర్ల పరీక్షకు సంబంధించి ఉదయం సెషన్ లో 10గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు జరిగిన థియరీ పరీక్షకు160 మంది అభ్యర్థులకు గాను 129 మంది హాజరయ్యారని, 31 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు. లైసెన్సెడ్ సర్వేయర్ అభ్యర్థులకు మధ్యాహ్నం 2గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు జరిగే పరీక్షను కూడా కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పోలీసు బందోబస్తుతో పాటు ఎలాంటి కాపీ జరుగకుండా పరీక్షను సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ మాధురి, డిఆర్ఓ పద్మజరాణి, జడ్పీ సీఈఓ జానకి రెడ్డి, సహాయ సంచాలకులు సర్వే ల్యాండ్ రికార్డు అధికారి ఐనేష్, ఆర్డీవో రవీందర్ రెడ్డి, పరీక్ష కేంద్రం చీఫ్ సూపర్డెంట్, అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now