పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలి
— ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి
– అడ్డుకున్న పోలీస్ లు
– రోడ్డు మీద బైఠాయించి ఆందోళన నిర్వహించిన ఎస్ ఎఫ్ ఐ నాయకులు
– కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జుల 14
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంను సోమవారం ముట్టడించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడిని పోలీస్ లు అడ్డుకోవడంతో అనంతరం రోడ్డు మీద బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రజినీకాంత్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సుమారు 8 వేల కోట్లకు పైగా స్కాలర్షిప్ లను ఫీజు రియంబర్స్మెంట్ ను పెండింగ్ లో పెట్టి విడుదల చేయకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం మూడు సంవత్సరాలుగా స్కాలర్షిప్లను పెండింగ్ లో పెట్టిందని కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా విడుదల చేస్తది అనుకుంటే విద్యార్థులకు మొండి చేయి చూపుతుందని అన్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను ఇవ్వకపోవడం వల్ల విద్యార్థుల సర్టిఫికెట్ల కోసం కాలేజీ యాజమాన్యాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని అన్నారు. సంవత్సరానికి 14 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్లకు అప్లై చేసుకుంటున్నారని సంవత్సరానికి 3000 కోట్ల చొప్పున మూడు సంవత్సరాలకు సుమారు తొమ్మిది వేల కోట్ల వరకు పెండింగ్ లో పెట్టడం వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రవేశపెట్టిందని ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ లో పెట్టడం శోచనీయమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన మాటను తప్పుతున్నారని అన్నారు. వెంటనే పెండింగ్ లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని లేనియెడల అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ముదాం అరుణ్ నాయకులు స్టాలిన్, సిహెచ్ మణికంఠ, రాహుల్, నితిన్, నవీన్, సాయిప్రకాష్ గౌడ్, మణిరజ్, రాఘవ, ప్రభు, అర్జున్, సాయి తదితరులు పాల్గొన్నారు.