ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణంపై కలెక్టర్ దృష్టి
క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్
నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు
డిఆర్డిఓ సురేందర్‌కు స్పష్టమైన సూచనలు
కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ విక్టర్
కామారెడ్డి జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నయి
కామారెడ్డి, ఆగస్టు 5 (ప్రశ్న ఆయుధం):
జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవన్ పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ ప్రత్యక్షంగా పరిశీలించారు. పనులు నాణ్యతతో పాటు వేగంగా పూర్తి కావలసిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. భవనం నిర్మాణాన్ని సమర్థంగా పర్యవేక్షించాలని డిఆర్డిఓ సురేందర్‌ను ఆయన ఆదేశించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌కు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్ అనుసరించారు.