బీబీపేట్ వంతెన పునరుద్ధరణపై కలెక్టర్ దృష్టి

బీబీపేట్ వంతెన పునరుద్ధరణపై కలెక్టర్ దృష్టి

యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీకి ఆదేశం

కామారెడ్డి, సెప్టెంబర్ 01 (ప్రశ్న ఆయుధం):

జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సోమవారం బీబీపేట్ మండలంలో పర్యటించారు. అధిక వర్షాల కారణంగా దెబ్బతిన్న బీబీపేట్ వంతెన వద్ద ఆర్‌అండ్‌బీ ఇఈ మోహన్‌తో కలిసి పునరుద్ధరణ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బీబీపేట్ నుండి సిద్దిపేట జిల్లా దుబ్బాకను అనుసంధానించే ఈ వంతెన అత్యంత కీలకమని గుర్తుచేశారు. వంతెన పునరుద్ధరణకు నిధుల కొరత లేదని స్పష్టం చేస్తూ, పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. వంతెనను త్వరగా ప్రజల రవాణా కోసం ఉపయోగంలోకి తీసుకురావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment