ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ సూచన
నాణ్యత, సమయపాలనపై అధికారులకు ఆదేశాలు
లబ్ధిదారులతో మమేకమైన కలెక్టర్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 13
లింగంపేట్ మండలం ఎల్లారాం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారుడు నల్లమల లక్ష్మీ ఇంటిని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. గృహ నిర్మాణంలో నాణ్యతను కాపాడుతూ నిర్దేశిత కాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన సిమెంట్, ఇసుక, ఇటుకలు సమయానికి అందుబాటులో ఉంచాలని తెలిపారు. లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. గ్రామస్తులు కలెక్టర్ పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ, గృహప్రవేశానికి హాజరుకావాలని ఆహ్వానించారు.