కళాశాల విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: జడ్జి సాయి శివ, పూజిత.
కోటగిరి (ప్రశ్న ఆయుధం )డిసెంబర్ 21.
కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో చట్టాలపై న్యాయ పరమైన అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ అవగాహన సదస్సు సందర్భంగా జడ్జిలు సాయి శివ పూజిత మాట్లాడుతూ… సమాజంలో జరగబోయే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు. కళాశాలలోని జూనియర్ విద్యార్థుల పట్ల సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేయరాదని పేర్కొన్నారు. చరవాణి వాట్సాప్ ఇంస్టాగ్రామ్ ఫేస్ బుక్ ల ద్వారా జరుగుతున్న మోసాలను గ్రహించి తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. వాట్సాప్ ల ద్వారా అసభ్యకరంగా సందేశాలను పంపించరాదన్నారు. ఆన్లైన్ గేమ్లకు మోసపోయి యువత ప్రాణాహాని చేసుకోవద్దన్నారు . జూనియర్ సీనియర్ విద్యార్థులు కళాశాలలో కలిసిమెలిసి ఉంటూ చదుపై శ్రద్ధ వహించి తల్లిదండ్రుల కోరికలను నెరవేర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కైసర్ పాష బోధన్ సిఐ వెంకటనారాయణ ఎస్సై సందీప్ కళాశాల అధ్యాపకులు దత్తాత్రి ప్రమోద్ పోలీసుల బృందం విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.