మరోసారి చర్చలు.. విఫలమైతే రేపటి నుంచి కాలేజీలు బంద్!
హైదరాబాద్:సెప్టెంబర్ 14
తెలంగాణలో తేదీ 15 సోమవారం నుంచి వృత్తి విద్యా కళాశాలలను నిరవధికంగా బంద్ చేస్తామని,తెలంగాణ ఉన్నంత విద్య సంస్థల ఫెడరేషన్ ఆదివారం సంచలన ప్రకటన చేసింది, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ,ఫార్మా నర్సింగ్, కాలేజీలు ఈ బంద్ లో పాల్గొననున్నట్లు ఫెడరేషన్ నేతలు వెల్లడించారు.
నిధుల విడుదలపై నిన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబుతో,జరిపిన చర్చలు విఫలమయ్యాయి.ఆదివారం మరోసారి మీటింగ్ జరగనుంది. సయోధ్య కుదరకపోతే రేపటి నుంచి ప్రొఫెషనల్ కాలేజీలు, డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్ చేసే అవకాశం ఉంది.
అటు ఇంటర్, డిగ్రీ కాలేజీలు సైతం బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. 15 వ తేదీ నుండి ప్రతిపాదిత నిరవధిక సమ్మెను నివారించడానికి ప్రైవేట్ ప్రొఫెషనల్, డిగ్రీ ,పీజీ కళాశాలల యాజమాన్యా లతో చర్చలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చింది.ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను దశలవారీగా క్లియర్ చేయడం గురించి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శనివారం ఆర్థిక మరియు విద్యా శాఖలతో ఈ అంశాన్ని సమీక్షించారని అధికారిక వర్గాలు తెలిపాయి.
గత ఐదు సంవత్సరాలుగా పేరుకుపోయిన దాదాపు రూ.8,000 కోట్ల బకాయిల ను యాజమాన్యాలు నిరసనకు కారణమని పేర్కొన్నాయి. గత సంవత్సరం ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ కోసం రూ.1,200 కోట్ల విలువైన టోకెన్లను జారీ చేసినప్ప టికీ, చెల్లింపు విడుదల చేయలేదని వారు ఆరోపించారు.
తాము పెరుగుతున్న అప్పులను ఎదుర్కొంటు న్నామని, బోధనా, బోధ నేతర సిబ్బందికి జీతాలు చెల్లించలేకపోతున్నామని యాజమాన్యాలు తెలిపాయి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయన సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శనివారం తెలంగాణ ఉన్నత సంస్థల సంఘాల సమాఖ్య ప్రతినిధులతో సమావేశమై సమ్మెను విరమించుకోవాలని కోరారు.