*రంగుల పండుగ హోళి*
రంగు రంగుల పండుగ హోళి
రంగుల హోళి జీవన కేలి
ప్రాచీనమైన పండుగ హోళి
పాటల పండుగ హోళి
ఆనందాల పండుగ హోళి!!
మోదుగు పూలచే రంగులతో ఆటపాట
పిల్లల పాటల హోళి
పొద్దంతా పాటల పండుగ
రంగుల హరివిల్లు హోళి!!
తెలంగాణ యాసలో పాటల హోళి
వసంత ఋతువు రాకతో వచ్చే పండుగ
పాటలతో మొదలయ్యే పండుగ
పది రోజుల పాటల పండుగ
మగవారు కొలలతో ఆట ఆడే పండుగ
స్త్రీల చప్పట్లతో పాటల పండుగ
ప్రకృతితో ముడిపడిన పండుగ హోలీ
పల్లె పల్లె నా పాటల పండుగ!!
రచన:-
దేవులపల్లి రమేశ్
నంగునూర్, సిద్దిపేట
9963701294