రాజ్యాంగ రక్షణ కొరకు బీఎస్పీ తో కలసి రండి జనకల్యాణ్ దివాస్ విరాళాల సేకరణకు సహకరించండి

బీఎస్పీ జిల్లా ఇన్చార్జి తడికల శివ కుమార్*
నవంబర్ 29 శుక్రవారం నాడు భద్రాచలం పట్టణ కేంద్రంలో బీఎస్పీ పార్టీ భద్రాచలం నియోజకవర్గ అధ్యక్షులు కొండా చరణ్ ఆధ్వర్యంలో జన కళ్యాణ్ దివాస్ విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ జిల్లా ఇంచార్జ్ తడికల శివకుమార్ మాట్లాడుతూ వేలాది సంవత్సరాలుగా బహుజన సమాజం కనీస మానవ హక్కులు నోచుకోకుండా జంతువుల కంటే హీనంగా బ్రతుకులు వెళ్లదీస్తున్న కాలంలో మహాత్మ జ్యోతిబాపూలే గారి నుండి మొదలుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వరకు మహనీయులు చేసిన పోరాటాల ఫలితంగా భారత రాజ్యాంగాన్ని సాధించుకోగలరు బి సి, ఎస్ సి ,ఎస్ టి, లు మరియు మత మైనారిటీలు భారత రాజ్యాంగం వల్ల మాత్రమే లబ్ధి పొందుతున్నారు నేడు అది ప్రమాదంలో పడింది మనం వెంటనే మేల్కొని రాజ్యాంగాన్ని పరిరక్షించుకోనట్లయితే ఆ రాజ్యాంగం ద్వారా సాధించుకున్న ప్రజాస్వామ్య హక్కుల్ని కోల్పోతాము మన సమాజం తిరిగి కట్టు బానిసత్వంలోకి దిగజారిపోతుంది మన రాజ్యాంగాన్ని పరిరక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మరియు సామాజిక ప్రజాస్వామ్యాన్ని సాధించడానికి బహుజన్ సమాజ్ పార్టీ ఒక్కటే ఒంటరి పోరాటం చేస్తుంది నేడు బహుజనులందరూ బిఎస్పీకి సహకరిస్తూ ఈ మహోద్యమంలో భాగస్వాములు కావాలని అన్నారు బిఎస్పి జాతీయ అధ్యక్షురాలు బహన్ కుమారి మాయావతి గారు( మాజీ ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్) ఇచ్చిన సర్వజనహితాయ సర్వజన సుఖాయ అనే నినాదంతో ముందుకు సాగుతున్న బహుజన్ సమాజ్ పార్టీ చేస్తున్న ఉద్యమంలో మనమందరం భాగస్వాములు కావాలని కోరుకుంటున్నామని అన్నారు అందులో భాగంగా దేశవ్యాప్తంగా మాన్యశ్రీ కాన్సిరాం గారిచే ప్రారంభించబడిన జనకల్యాణ్ దివాస్ ఆర్థిక సహాయ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కావున ఈ బృహత్తర కార్యక్రమంలో భద్రాచల నియోజకవర్గ ప్రజలు భాగస్వాములై ఆర్థిక సహాయాన్ని అందించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కొప్పుల నారాయణ, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment