ఈనెల 9వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదంచేయండి

ఈనెల 9వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ ఆశా వర్కర్ల సమ్మె నోటీసు. ఈరోజు కొమరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో డాక్టర్ అరుణ్ కుమార్ కి ఇవ్వడం జరిగింది

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జులై 4 ( ప్రశ్న ఆయుధం న్యూస్ ) దత్త మహేశ్వరరావు

జూలై 9 దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం జరుగుతున్న సమ్మెలో ఆశా వర్కర్లు మరియు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు పాల్గొంటున్నారని యూనియన్ నాయకులు రాజేశ్వరి దుర్గ తెలిపారు.

సమ్మె సన్నాహక సమావేశాల్లో భాగంగా ఈరోజు అనగా శుక్రవారం ఏపీ ఆశ వర్కర్స్ మరియు కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నాయకులు కొమరాడ మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న డాక్టర్ అరుణ్ కుమార్ సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది సమ్మె నోటీస్ ఇచ్చిన అనంతరం ప్రాథమిక ఆరోగ్యనుండి ఆశ వర్కర్ల యూనియన్ నాయకులు రాజేశ్వరి కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల నాయకులు దుర్గ సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి

మాట్లాడారు.

1. ఆశ వర్కర్లను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం అమలు చేసి పెర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు.

2. చట్టబద్ధమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు.

3. సంక్షేమ పథకాలను కార్మికులందరికీ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు.

4. కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆసాలుగా మార్చాలని డిమాండ్ చేశారు.

5. 10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం వర్కర్లందరికి కల్పించాలని కోరారు.

6. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న లేబర్ కోట్లు రద్దు చేయాలని కార్మికుల కార్మికులకు రక్షణ చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు మరియు ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

 

Join WhatsApp

Join Now

Leave a Comment