ప్రశ్న ఆయుధం :కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం రూ. లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిందని సీఎం చెప్పారు…రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వ లోపాలను శాసనసభలో చర్చకు సవాలు విసిరారు. గత 10 ఏళ్లలో రూ. 1.5-2 లక్షల కోట్ల ఖర్చు చేసినా 10 ఎకరాలకు కూడా నీళ్లు అందించలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సంవత్సరంలోనే రూ. 1 లక్ష కోట్లతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. కృష్ణా, గోదావరి బేసిన్ నీటి వినియోగంపై శాసనసభలో లెక్కలతో సహా చర్చకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.రూ. లక్ష కోట్ల పంపిణీపై చర్చకు రావాలని కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ కు సవాలు విసిరితే కేటీఆర్ బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు.
ప్రెస్ క్లబ్ లో కాదు…శాసన సభలో చర్చిద్దాం రండి
Published On: July 12, 2025 10:06 pm