*26వ వార్డులో కల్వర్టర్ మరమత్తు పనులకు కౌన్సిలర్ చొరవతో శ్రీకారం చుట్టిన చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు*
*జమ్మికుంట నవంబర్ 5 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డు లో కల్వర్టర్ మరమ్మతు పనులకు కౌన్సిలర్ దిడ్డి రాము చొరవతో మున్సిపాలిటీ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు శ్రీకారం చుట్టారు దిడ్డి రాము మాట్లాడుతూ వర్షాల కారణంగా వరద ప్రభావం ఎక్కువ కావడంతో గత రెండు సంవత్సరాల క్రితం కృంగిపోవడం జరిగిందని 26,28 వార్డులకు ప్రధాన రహదారిగా ఉన్నటువంటి ఈ కల్వర్టర్ మీదుగా వెళ్లడం చాలా ఇబ్బందికరంగా ఉందని మున్సిపల్ అధికారులను కలిసి సమస్యను 26వ వార్డు కౌన్సిలర్ దిడ్డి రాము వివరించారు పాలకవర్గంతో రాము మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని వార్డులలో మిషన్ భగీరథ పైపుల కోసం తవ్వినటువంటి వాటిని పూడ్చడం కోసం 20 లక్షల నిధులు విడుదల చేయడం జరిగిందని దానిలో భాగంగా 26 వార్డుకు కొంత ఖర్చు చేసి కల్వర్టర్ మరమ్మత్తులు చేయవలసిందిగా కౌన్సిలర్ మున్సిపల్ పాలకవర్గంతో చర్చించగా స్పందించిన మున్సిపల్ కమిషనర్ ఆయాజ్, మున్సిపాలిటీ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మరమ్మత్తుల నిమిత్తం మంగళవారం రోజు పూజ చేసి పనిని ప్రారంభించారు