*ఎండాకాలంలో నీటి సమస్య రాకుండా చూసుకోవాలి*
*మిషన్ భగీరథ డి ఈ ,ఏ ఈ ఈ సమీక్షా సమావేశంలో కమిషనర్ ఆయాజ్*
*జమ్మికుంట ఏప్రిల్ 9 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులలో మిషన్ భగీరథ నీటి సమస్య రాకుండా చూడాలని మిషన్ భగీరథ డి ఈ బాలరాజు ఎ ఈ ఈ భార్గవ్ ప్రసాద్ తో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మునిసిపల్ కమిషనర్ మహ్మద్ ఆయాజ్ అన్నారు కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ ఎండాకాలం మొదలవుతున్న తరుణంలో మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డులో మిషన్ భగీరథ సమస్య తలెత్తకుండా చూడాలని, ఎండ కాలంలో నీటి అవసరం అధికంగా ఉన్నందున నీటి విడుదల పెంచాలని కమిషనర్ కోరారు. వార్డులలో నీటి సమస్య తలెత్తకుండా చూడాలని, వార్డులలో ఉన్న నీటి సమస్యలపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో డిఈ బాలరాజు సానుకూలంగా, నీటి సమస్యపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ రాజిరెడ్డి ,ఏ ఈ నరేష్ తదితరులు పాల్గొన్నారు