Headlines in Telugu:
-
అల్విన్ కాలనీలో కమిటీ హల్ నిర్మాణం ప్రారంభం – కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
-
50 లక్షల నిధులతో కమిటీ హల్ నిర్మాణ పనులు ప్రారంభించిన కార్పొరేటర్
-
కాలనీవాసుల కోసం కమిటీ హల్ నిర్మాణం ప్రారంభించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
ప్రశ్న ఆయుధం నవంబర్ 04: కూకట్‌పల్లి ప్రతినిధి
124 అల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని మహాత్మా గాంధీ నగర్ లో యాభై లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న కమిటీ హాల్ నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కమిటీ హాల్ నిర్మాణం నాణ్యత ప్రమాణాలతో వీలైనంత త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు. కాలనీలో చిన్న చిన్న ఫంక్షన్లు జరుపుకోవడానికి, సమావేశాలు నిర్వహించుకోవడానికి కమిటీ హాల్ కాలనీ ప్రజలకు ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమంలో పాండుగౌడ్, ప్రదీప్ రెడ్డి, షౌకత్ అలీ మున్నా,, వెంకట్ యాదవ్, ఇంద్రసేన రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పోశెట్టిగౌడ్, పద్మయ్య, గణేష్, సతీష్, నాగరాజు, ప్రేమ్ చంద్, సతీష్ గౌడ్, రాజు, సుమిత, ఏఇ రాజీవ్, వర్క్ ఇస్పెక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.