మూసాపేట్ డివిజన్ బిజెపి సీనియర్ నాయకులు ఐలయ్య యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని మూసాపేట్ ఎల్లమ్మ ఆలయం ప్రాంగణంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో బిజెపి సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు ఐలయ్య యాదవ్ ని శాలువాతో సన్మానించి, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
సమాజ సేవలో ముందుండే ఐలయ్య యాదవ్, బిజెపి సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని రాజేశ్వరరావు అన్నారు. పార్టీ పట్ల ఆయనకున్న అంకితభావం కార్యకర్తలకు ప్రేరణ అని పేర్కొన్నారు.
ప్రజల సమస్యల పరిష్కారంలో ఐలయ్య యాదవ్ చూపుతున్న శ్రద్ధ ప్రశంసనీయమని, భవిష్యత్తులోనూ ఆయన మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి దేవుడు శక్తిని ప్రసాదించాలని రాజేశ్వరరావు ఆకాంక్షించారు.










