సంగారెడ్డి, జూలై 1
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని అల్లాపూర్ గ్రామంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు పథకం కింద కొత్త గృహానికి ఈ రోజు గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు.
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం అల్లాపూర్ గ్రామంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు పథకం కింద నిర్మించిన నూతన గృహానికి ఈ రోజు గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ జి. అంజయ్య, మండల పార్టీ అధ్యక్షుడు బాలాజీ నర్సింలు, ఆలయ కమిటీ చైర్మన్ సతీష్ కులకర్ణి, సర్పంచ్ చరణ్ కుమార్, మాజీ సర్పంచ్ కేధర్ నాథ్, మాజీ సర్పంచ్ సతీష్, మాజీ ఎంపీటీసీ మహంకాళి, మాజీ యువత అధ్యక్షులు ప్రభాకర్, యువత అధ్యక్షుడు సుదర్శన్ తదితరులు హాజరై నూతన గృహాన్ని సందర్శించి, లబ్ధిదారుల కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని అమలు చేస్తోందని, అర్హులైన ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం గృహ యజమానులను శాలువాతో సత్కరించి, వారి కుటుంబం ఆనందం, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











